ఓవర్సీస్ ప్రీమియర్స్ తో రికార్డ్ సృష్టించిన ‘ఆగడు’

Published on Sep 20, 2014 7:30 am IST

aagadu

‘దూకుడు’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘ఆగడు’ సినిమా భారీ అంచనాల నడుమ నిన్న విడుదలై కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిలిచింది. భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఎన్నడూ లేనంతగా అత్యధిక స్క్రీన్స్ లో ప్రీమియర్స్ పడ్డాయి. ఓవర్సీస్ లో మహేష్ సినిమాలకు మామూలుగానే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది, ఆ కారణంగా ప్రీమియర్స్ తోనే కలెక్షన్స్ రికార్డ్ సృష్టించింది.

ఆగడు సినిమాకి ఓవర్సీస్ లో వేసిన ప్రీమియర్స్ ద్వారా 5 లక్షల డాలర్ల షేర్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో ఓ తెలుగు సినిమా ప్రీమియర్స్ కి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఇదే ప్రధమం. దీనితో మరిసారి ఓవర్సీస్ బాక్స్ ఆఫీసు వద్ద మహేష్ బాబు తన స్టామినా చూపించాడు. మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది.

‘ఆగడు’ సినిమా ఒక్క ఓవర్సీస్ లోనే కాకుండా విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టుకుంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :