నైజాంలో ఆల్ టైం రికార్డ్ సృష్టించిన ఆగడు

Published on Sep 20, 2014 9:30 am IST

aagadu-reports

నిన్న ఉదయం నుండి ప్రేక్షకుల చేత థియేటర్స్ లో విజిల్స్ వేయిస్తున్న ‘ఆగడు’ సినిమా ఏరియా అనేది చూడకుండా అన్ని చోట్లా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్, ఓవర్సీస్ లో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఆగడు నైజాంలో కూడా ఆల్ టైం రికార్డ్ సాధించింది.

ట్రేడ్ పండితులు ఇచ్చిన న్యూస్ ప్రకారం ఆగడు సినిమా మొదటి రోజు నైజాంలో 3.45 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. నైజాంలో మొదటి రోజు కలెక్షన్ ఈ రేంజ్ లో రావడం ఇదే మొదటిసారి కావడంతో ఆగడు ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు చేసిన హై రేంజ్ ప్రమోషన్స్, మహేష్ స్టార్డం ఈ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడానికి హెల్ప్ అవుతోంది. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం :