మురుగదాస్ పై అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మురుగదాస్ పై అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Published on Apr 28, 2024 10:11 PM IST

సౌత్ ఇండియన్ బ్లాక్ బస్టర్ గజినీని హిందీలో రీమేక్ చేశాడు అమీర్ ఖాన్. సూర్యతో ఒరిజినల్ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన ఏఆర్ మురుగదాస్ రీమేక్ వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించాడు. అమీర్ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. భారతదేశంలో 100 కోట్ల నెట్‌ని వసూలు చేసిన మొదటి హిందీ చిత్రం గా నిలిచింది. ఇటీవల బాలీవుడ్ స్టార్ నటుడు కపిల్ శర్మ షోలో పాల్గొన్న సందర్భంగా ఏఆర్ మురుగదాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అమీర్ ఖాన్ మాట్లాడుతూ, “అతను ఎటువంటి ఫిల్టర్‌లు లేని ప్రత్యేకమైన వ్యక్తి. ఒక సన్నివేశానికి సంబంధించి మనం అతనికి కొన్ని సలహాలు చెబితే, అతను ఎటువంటి ఫిల్టర్లు లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆ ఐడియా నచ్చకపోతే చాలా బ్యాడ్ అని ఏ మాత్రం సంకోచం లేకుండా చెబుతాడు. అవతలి వ్యక్తి చెడుగా భావిస్తే అతను పట్టించుకోడు. అలాగే, అతను ఎవరితో మాట్లాడుతున్నాడో ఆలోచించడు. మురుగదాస్ ఆలోచన నచ్చితే, అతను సూపర్హిట్ సార్, సూపర్హిట్ అంటాడు. మీరు చూడండి, అతనికి ఇక్కడ ఫిల్టర్ కూడా లేదు. ఇది నేను అతని నుండి స్వీకరించిన గుణం అంటూ చెప్పుకొచ్చారు.

మురుగదాస్ ప్రస్తుతం శివకార్తికేయన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అతను దానిని పూర్తి చేస్తే, సల్మాన్ ఖాన్ యొక్క సికందర్ ను తదుపరి స్టార్ట్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు