అమీర్ పీ.కే చిత్రానికి ఇండియాలో బ్యాన్?

అమీర్ పీ.కే చిత్రానికి ఇండియాలో బ్యాన్?

Published on Dec 26, 2014 8:30 AM IST

PK
భారతీయ మత వ్యవస్థను ప్రశ్నిస్తూ, ఇక్కడి దేవుళ్ళపై విమర్శనాస్త్రాలు సంధించిన కారణాన ఆమీర్ నటించిన పీకే సినిమాను ఒక మతం పెద్దల ఆగ్రహానికి గురయ్యింది. దీంతో వారు తమ హిందూ మతాన్ని కించపరిచే విధంగా సినిమాలో పలు అభ్యంతకర సన్నివేశాలు వున్నాయని ఆమీర్ మరియు దర్శకుడు హిరాణిలపై ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేశారు ముఖ్యంగా “భయపడిన వాడు మాత్రమే గుడికి వెళ్తాడు” అని సినిమాలో వాడిన సంభాషణ అందులో చేర్చడం గమనార్హం

అయితే దీనిపై తగిన తీర్పు తీసుకునే వరకూ సినిమాను ఇండియాలో నిలిపివేయాలని సుప్రీమ్ కోర్టు సమన్లు జారీ చేసినట్టు సమాచారం. ఈ వార్తే గనుక నిజమైతే క్రిస్మస్ హాలిడేస్ ని పురస్కరించుకుని, కలెక్షన్ల తుఫాను సృష్టిస్తున్న ఈ సినిమా భారీగానే నష్టపోయే సూచనలు వున్నాయి

తాజా వార్తలు