సమీక్ష : “ఆరంభం” – ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది

సమీక్ష : “ఆరంభం” – ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది

Published on May 11, 2024 1:52 AM IST
Aarambham Movie Review in Telugu

విడుదల తేదీ : మే 10, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: మోహన్ భగత్, సుప్రీత సత్యనారాయణ భూషన్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బొడ్డేపల్లి అభిషేక్, సురభి ప్రభావతి

దర్శకుడు: అజయ్ నాగ్ వి

నిర్మాత: అభిషేక్ వి తిరుమలేష్

సంగీత దర్శకుడు: సింజిత్ యర్రమిల్లి

సినిమాటోగ్రఫీ: దేవదీప్ గాంధీ కుండు

ఎడిటింగ్: ఆదిత్య తివారీ, ప్రీతం గాయత్రి

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఓ చిన్న చిత్రం “ఆరంభం” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ :

ఇక కథలోకి వస్తే.. మిఘేల్(మోహన్ భగత్) కాళీఘాట్ జైలులోని ఓ ఖైదీ కాగా తాను ఆ జైలు నుంచి తప్పించుకున్న విధానంగా అక్కడి జైలర్ ఇతర అధికారులకి మిస్టీరియస్ గా అనిపిస్తుంది. మరి ఈ క్రమంలో అదే ఆఫీసర్స్ లో ఇద్దరు చైతన్య(రవీంద్ర విజయ్) అలాగే మహాదేవ్ (అభిషేక్ బొడ్డేపల్లి) లు డిటెక్టివ్ లు గా మారి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. మరి అసలు ఈ మిఘేల్ ఎవరు? అతను జైలు నుంచి ఎలా మాయం అయ్యాడు? తన వెనుక ఎవరున్నారు? ఈ ప్రశ్నలు అన్నిటికి సమాధానం దొరకాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా విషయంలో మొదటిగా దర్శకుడు అజయ్ నాగ్ విజన్ ని మెచ్చుకోవాలి. తాను తీసుకున్న భిన్నమైన కథాంశం దానిని కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ గా తీర్చిదిద్దిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. దీనితో తన నుంచి మరిన్ని సినిమాలు ఆశించవచ్చు. కేరాఫ్ కంచరపాలెం నటుడు మోహన్ భగత్ ఈ చిత్రంలో సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. చాలా సహజమైన నటనతో హావభావాలతో మంచి నటన కనబరిచాడు.

అలాగే రవీంద్ర విజయ్ కూడా పలు సన్నివేశాల్లో మంచి నటన ప్రదర్శించాడు, ఇంకా హీరో తల్లి పాత్రలో కనిపించిన సురభి ప్రభావతి ఎమోషనల్ గా డీసెంట్ పెర్ఫామెన్స్ ని అందించారు. అలాగే లక్ష్మణ్ మీసాల తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. ఇక సినిమాలో ఎమోషనల్ కంటెంట్ కూడా వర్కౌట్ అవుతుంది. భూషణ్ కళ్యాణ్, హీరో పాత్రల నడుమ సన్నివేశాలు బాగున్నాయి. అలాగే ఫస్టాఫ్ కూడా మెప్పిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో కథాంశం బాగుంది కానీ కథనంలో కొన్ని లోటు పాట్లు ఉన్నాయి, కొన్ని సీన్స్ రిపీటెడ్ గా చూస్తున్నట్టు అనిపిస్తున్నాయి. అలాగే సినిమాలో కాన్సెప్ట్ సంబంధించి కొన్ని సన్నివేశాలు ఇంకా ఆసక్తిగా ప్రెజెంట్ చేయాల్సింది.
అలాగే మరికొన్ని ఎమోషనల్ సన్నివేశాలని కూడా ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుణ్ణు అనే భావన సినిమా చూసినప్పుడు కలుగక మానదు.

ఇక వీటితో సినిమాలో బాగా ఇబ్బందికరంగా అనిపించే అంశం ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అని చెప్పాలి. ఇది అంతగా ఆసక్తిగా సాగదు. సాగదీతగా బాగా బోర్ గా ఇది అనిపిస్తుంది. అలాగే పలు ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు కూడా ఇంకా బెటర్ గా డిజైన్ చేసి ఉంటే ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ బాగుండేవి.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సందీప్ అంగడి డైలాగ్స్ బాగున్నాయి. శింజిత్ ఎర్రమల్లి సంగీతం, నేపథ్య గీతం బాగున్నాయి. అలాగే దేవ్ డీప్ గాంధీ కుండు సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రీతమ్ గాయత్రీ, ఆదిత్య టి తివారి ల ఎడిటింగ్ పర్వాలేదు.

ఇక దర్శకుడు అజయ్ నాగ్ విషయానికి వస్తే.. తాను తీసుకున్న కథాంశం చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ‘నీను నిన్నోలాగే ఖైదీ’ అనే ఓ కన్నడ నవల ఆధారంగా తెరకెక్కించాడు. అయితే దానిని ప్రెజెంట్ చేసిన విధానం కొంతవరకు ఓకే అనిపిస్తుంది కానీ ఇది పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే.. ఈ “ఆరంభం” లో మోహన్ భగత్, రవీంద్ర విజయ్ తదితర నటులు మంచి పెర్ఫామెన్స్ లు కనబరిచారు అలాగే ఇందులో మెయిన్ పాయింట్ బాగానే ఉంది కొన్ని ఎమోషన్స్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ పర్వాలేదు. కానీ కన్ఫ్యూజ్డ్ గా అనిపించే కొన్ని సీన్స్, స్లోగా మరియు బోరింగ్ గా సాగే కథనం చికాకు తెప్పిస్తాయి. వీటితో అయితే కొన్ని సీన్స్ వరకు పర్వాలేదు కానీ పూర్తి స్థాయిలో ఆడియెన్స్ కి ఈ చిత్రం కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువే అని చెప్పాలి.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు