బన్నీ ‘పుష్ప’ కోసం ఆర్య ?

Published on Nov 11, 2020 4:35 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో మొదట తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించాలి. విజయ్ కూడా ఆ పోలీస్ పాత్రలో నటిస్తా అని కమిట్ అయ్యాడు. కానీ కరోనా కారణంగా షెడ్యూల్స్ అన్ని మిస్ అయి.. డేట్స్ అన్ని క్రాస్ అయి మొత్తానికి విజయ్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ పాత్రలోనే మరో తమిళ హీరో ఆర్యను తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఆర్య, బన్నీ వరుడు సినిమాలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది రష్మిక. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. అన్నట్టు త్వరలోనే సాంగ్స్ షూట్ కి పుష్ప టీం రెడీ అవుతోంది.

సంబంధిత సమాచారం :