హైదరాబాద్ లో ఆషికి 2 రిమేక్

హైదరాబాద్ లో ఆషికి 2 రిమేక్

Published on May 10, 2014 11:10 AM IST

Sachiin-Joshi-New-Movie-Ope
ఆషికీ 2 సినిమా రీమేక్ లో సచిన్ జోషి, నజియా హుస్సేన్ నటిస్తున్న విషయం తెలిసినదే. ఈ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. జయ రవీంద్ర ఈ సినిమాకు దర్శకుడు. విన్కింగ్ మీడియా నిర్మిస్తున్న ఈ సినిమాకు బండ్ల గణేష్ సమర్పకుడు

హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా తరువాత ప్రధాన తారాగణంపై గోవాలో ముఖ్య సన్నివేశాలను తెరకెక్కించారు. ప్రస్స్తుతం హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ ని జరుపుకుంటున్నారు. సచిన్ జోషి ప్రముఖ గాయకుడిగా కనిపిస్తూ లోకల్ ఫీమేల్ సింగర్ వేటలో ఉంటాడు. తెలుగు వెర్షన్ లో కొన్ని మార్పులు చేసినా ఒరిజినల్ వెర్షన్ లో పాటలు వాడుకునే పనిలో బృందం నిమగ్న మై వున్నారు

ప్రస్తుతం నజియా హుస్సేన్ హస్ముఖ్ పిఘాల్ గయా అనే హిందీ సినిమాలో నటిస్తుంది

తాజా వార్తలు