ఆత్మని కనుక్కోవడానికి సిద్దమవండి

ఆత్మని కనుక్కోవడానికి సిద్దమవండి

Published on Oct 6, 2019 7:01 PM IST

Aaviri1

దర్శకుడు రవిబాబు సినిమాలు తీసే పద్దతే భిన్నంగా ఉంటుంది. అందరూ ఫాలో అయ్యే కమర్షియల్ ఎలిమెంట్స్, స్టార్ కాస్ట్ ఫార్ములాల్ని కాకుండా ఎంచుకునే కాన్సెప్ట్ కొత్తగా, వింతగా ఉండేలా చూసుకుంటారాయన. ఆ పద్దతిలో ఆయన తీసిన కొత్త సినిమానే ‘ఆవిరి’.

ఆసక్తికరమైన టీజర్లతో ఆకట్టుకున్న ఈ సినిమా అన్ని పనులు ముగించుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఈ నెల 18న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే థియేటర్లలో ఆత్మని కనుక్కోవడానికి రెడీ అవండి అంటూ అనౌన్స్ చేశారు. రవిబాబు స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. గతంలో రవిబాబు ‘అవును’లాంటి మంచి హర్రర్ చిత్రాన్ని అందించారు. అందుకే ఈ సినిమా మీద ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

తాజా వార్తలు