‘ఆవిరి’ టీజర్ రెడీ

‘ఆవిరి’ టీజర్ రెడీ

Published on Sep 26, 2019 7:38 PM IST

Aaviri1

‘అనసూయ, నచ్చావులే, అనసూయ, అవును’ లాంటి చిత్రాలతో తన ప్రత్యేక శైలిని చాటుకున్న దర్శకుడు రవిబాబు. కానీ గత కొన్నాళ్ళుగా ఆయనకు సరైన హిట్ లేదు. ఆయన చివరి ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’ కూడా పరాజయం చెందింది. దీంతో ‘ఆవిరి’ పేరుతో కొత్త ప్రయత్నం చేస్తున్నారు రవిబాబు.

ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసిన రవిబాబు ఇప్పుడు టీజర్ సిద్దం చేశారు. ఈ నెల 28న టీజర్ విడుదల కానుంది. సినిమాలో నటీనటులేవరు అనేది టీజర్లోనే రివీల్ అవుతుంది. రవిబాబు స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు