ఉన్నట్టుండి సినిమాలను ఎందుకు వదిలేశాడో చెప్పిన హీరో

Published on Jan 21, 2021 1:21 am IST


ఆ హీరో ఒకప్పుడు అమ్మాయిలకు హాట్ ఫెవరెట్ హీరో. బాయ్ ఫ్రెండ్ అంటే అలా ఉండాలి అని చెప్పుకునేంత క్రేజ్. కెరీర్లో మంచి మంచి హిట్ సినిమాలున్నాయి. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళంలో చాలా సినిమాలు చేశాడు. కానీ ఉన్నపళంగా సినిమాలను వదిలేశాడు. అతనే అబ్బాస్. అబ్బాస్ వెండితెర మీద కనబడి ఛాన్నాళ్ళే అయింది. ‘ప్రేమదేశం’ సినిమాతో 1996లో ఎంట్రీ ఇచ్చిన ఈయన వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలు చేసి బాగా పాపులర్ అయ్యారు.

ఒక దశలో ఏడాదికి ఆరేడు సినిమాలు చేశాడు ఈ లవర్ బాయ్. రజినీకాంత్, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించాడు. కానీ కొన్నేళ్ల తరవాత ఆయన సినిమాలే కాదు చేస్తున్న పాత్రలు కూడ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఆ పరాజయాల పరంపర కొన్నేళ్లు సాగింది. కొన్నిసార్లు బలవంతం మీద, తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాలు చేశారు. దీంతో విసుగెత్తి ఆలోచనలో పడిన అబ్బాస్ సినిమాలనే వదిలేశాడు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయమే మాట్లాడిన ఆయన చాలా బోర్ కొట్టేసి నటనకు స్వస్తి చెప్పానని, పాత్రలో, నటనలో మనసు పెట్టలేనప్పుడు నటనకు న్యాయం చేయలేనని అనిపించి బయటికి వచ్చేశానని చెప్పుకొచ్చారు. అంతేకాదు రీఎంట్రీ మీద కూడ ఆయనకు అంతగా ఆసక్తి ఉన్నట్టు కనిపించట్లేదు.

సంబంధిత సమాచారం :

More