బ్యూటిఫుల్ టీజర్ అనిపించుకున్న ‘అబ్బాయితో అమ్మాయి’

abbayitho-ammayi
‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ లాంటి వరుస లవ్ ఎంటర్టైనర్స్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో నాగ శౌర్య రీసెంట్ గా ట్రై చేసిన మాస్ ఎంటర్టైనర్ ‘జాదూగాడు’ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమా తర్వాత నాగ శౌర్య రెండు సినిమాలతో బిజీ అయ్యాడు. అందులో ముందుగా నందిని రెడ్డి డైరెక్షన్ లో చేస్తున్న ‘కళ్యాణ వైభోగమే’ సినిమా చివరి దశకు చేరుకుంది. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సాంగ్స్ మాత్రమే బాలన్స్ ఉన్నాయి. ఈ సినిమా కాకుండా నాగ శౌర్య రమేష్ వర్మ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘అబ్బాయితో అమ్మాయి’.

షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ టీజర్ ని నిన్న రమేష వర్మ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసారు. ఈ టీజర్ చూసిన వారంతా చాలా ప్లెజంట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉందని కితాబులిస్తున్నారు. ముఖ్యంగా మాస్ట్రో ఇళయరాజా సంగీతం, శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ చాలా బాగుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేయనున్నారు. నాగ శౌర్య సరసన బాలీవుడ్ భామ పాలక్ లల్వాని హీరోయిన్ గా నటించనుంది. జెజె సినిమాస్ పతాకంపై జక్కం వందనా అలేఖ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పక్కా యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రమేష్ వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

అబ్బాయితో అమ్మాయి టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version