ఏబిసిడి రిలీజ్ అవ్వబోతుంది !

ఏబిసిడి రిలీజ్ అవ్వబోతుంది !

Published on Jan 14, 2019 5:17 PM IST

యంగ్ హీరో అల్లు శిరీష్ ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ మూవీ ఏబిసిడి (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి ) తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం మార్చి 1వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుందట.

నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రుక్సార్ మీర్ హీరోయిన్ గా నటిస్తుండగా బిగ్ బెన్ సినిమాస్ అధినేత యష్ రంగినేని మరియు మధుర శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి జుదా శాండీ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు