రామ్ చరణ్ తో అభిలాష రీమేక్.?

రామ్ చరణ్ తో అభిలాష రీమేక్.?

Published on Mar 13, 2013 11:10 AM IST

Ram-Charan
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, రాధిక హీరోయిన్ గా యండమూరి వీరేంద్రనాథ్ నవలా ఆధారంగా ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో కె.ఎస్ రామారావు నిర్మించిన సినిమా ‘అభిలాష’. గత ముప్పై ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి చిరంజీవి కెరీర్ కి ఎంతో హెల్ప్ అయ్యింది. ఈ సినిమా విడుదలై ముప్పై ఏళ్ళు కావడంతో ఈ చిత్ర టీం నిన్న సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ కోదండరామి రెడ్డి, కె.ఎస్ రామారావు, యండమూరి వీరేంద్రనాథ్, మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.

నిర్మాత కె.ఎస్ రామారావు మాట్లాడుతూ ‘ ఇటీవలే గొల్లపూడి మారుతీ రావు గారిని కలిసినప్పుడు ‘అభిలాష’ చాలా మంచి సినిమా, అదే సినిమాని అదే యూనిట్ తో ఇప్పటికి తగ్గట్టు తీయమని ఆయన సలహా ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగానే నాక్కూడా చేయాలని ఉంది. ఒకవేళ చిరంజీవిగారితో కుదరకపోతే రామ్ చరణ్ తో అయినా ఈ సినిమా చేస్తానని’ అన్నారు. ఒకవేళ రామ్ చరణ్ ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకొని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలపండి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు