ఇంటర్వ్యూ : అభినవ్ గోమఠం – ట్రైలర్ లో చూపించింది తక్కువ, సినిమాలో చాల ఉంది !

ఇంటర్వ్యూ : అభినవ్ గోమఠం – ట్రైలర్ లో చూపించింది తక్కువ, సినిమాలో చాల ఉంది !

Published on Oct 28, 2019 3:41 PM IST

ABHINAV GOMATAM j

 

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా నిర్మిస్తోన్న తొలి చిత్రం.. ‘మీకు మాత్రమే చెప్తా’. దర్శకుడు తరుణ్ భాస్కర్, వాణి భోజన్, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి నూతన దర్శకుదు షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం నవంబర్ 1న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా అభినవ్ గోమఠంతో ఇంటర్వ్యూ.

 

మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి ?

నేను పుట్టింది హైదరాబాద్ లోనే అండి. కాకపోతే పెరిగింది మాత్రం గుజరాతీలో. మా డాడి ఎయిర్ ఫోర్స్ లో జాబ్. అందుకే వేరు వేరు చోట్ల నా ఎడ్యుకేషన్ జరిగింది. బి.టెక్ చేశాను, (నవ్వుతూ) చేయకుండా ఉంటే బాగుండేది. కానీ కాలేజీలోనే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. బహుశా నాకు కాలేజీ లైఫ్ అలా ఉపయోగపడింది. సినిమాల పై ఇంట్రస్ట్ తో మొదట థియేటర్ ఆర్టిస్ట్ గా చేశాను, ఆ తరువాత సినిమాల్లోకి వచ్చాను.

 

‘మీకు మాత్రమే చెప్తా’ కాన్సెప్ట్ ఏమిటి ?

షమ్మీర్ సుల్తాన్ అండ్ అర్జున్ స్టోరీని చాల బాగా రాసుకున్నారు. మొబైల్స్ వల్ల మనిషి ప్రైవసీ ఎలా డిస్టర్బ్ అవుతుందనేది చాల ఇంట్రస్టింగ్ ప్లేతో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో రాసుకున్నారు. చాల బాగుంటుంది. ట్రైలర్ లో చూపించింది చాల తక్కువ, సినిమాలో చాల ఉంది. రేపు సినిమా చూశాకే మీకే అర్ధమవుతుంది.

 

మీ సినిమాలో జరిగినట్లుగానే మీ ఫోన్ లోని సీక్రెట్స్ ఎప్పుడైనా బయట పడ్డాయా ?

బయట పడటానికి నా సెల్ ఫోన్ లో ఏమి సేవ్ చేసి ఉండవుగా. మహా అయితే ఏదో నా ఫోటోలు ఉంటాయి. అయినా నా ఫోన్ లో ఆ స్థాయి సీక్రెట్స్ ఏం ఉండవు. ముఖ్యంగా సినిమాలో సెల్ ఫోన్ తో జరిగేంత ఘోరాలు ఏమి నా లైఫ్ లో ఎప్పుడు జరగలేదు.

 

ఇంతకీ సెల్ ఫోన్ వల్ల సినిమాలో జరిగిన ఘోరాలు ఏమిటి ?

అదే కదా సినిమా. అలా ఎలా చెబుతారు. సినిమాలో చూసి తెలుసుకోండి.

 

ఈ సినిమాకి ‘మీకు మాత్రమే చెప్తా’ అని టైటిల్ పెట్టడానికి కారణం ?

నిజానికి ఈ సినిమాకి మేం పెట్టాలకున్నా టైటిల్ ‘ఎవ్వరికీ చెప్పొద్దు’. కానీ అప్పటికే ఆ టైటిల్ తో వేరే సినిమా రాబోతుందని తెలిసింది. ఇక ఏ టైటిల్ పెట్టాలి అని ఆలోచిస్తున్న టైంలో ‘మీకు మాత్రమే చెప్తా’ అనే టైటిల్ అయితే కథకు సెట్ అవుతుందని ఈ టైటిల్ పెట్టాం.

 

‘మీకు మాత్రమే చెప్తా’ అని సినిమాలో ఎక్కువుగా ఎవరు పలుకుతారు ?

కథకు ఆ డైలాగే మెయిన్ అండి. ఇక సినిమాలో ‘మీకు మాత్రమే చెప్తా’ అనే మాటను ఎక్కువుగా నేనే చెబుతాను.

 

దర్శకుడు తరుణ్ భాస్కర్ మీకు ఫ్రెండ్. తను హీరోగా యాక్ట్ చేస్తాడని మీరు ఎప్పుడైనా అనుకున్నారా ?

తరుణ్ భాస్కర్ బాగా ఇమిటేట్ చేస్తాడు. సెట్ లో కూడా చాల బాగా ఆట పట్టిస్తాడు. అది చూసినప్పుడు… యాక్ట్ చెయ్యగలడు అని అనుకున్నాను గాని, బట్ ఇంత త్వరగా యాక్ట్ చేస్తాడని.. అదీ హీరోగా యాక్ట్ చేస్తాడని ఊహించలేదు. తను చాల బాగా యాక్ట్ చేశాడు.

 

మీకు దర్శకత్వం పై ఇంట్రస్ట్ ఉందా ?

ఇంట్రస్ట్ ఉందనే అనిపిస్తోంది అండి. (నవ్వుతూ) హాలీవుడ్ సినిమాలు చూసినప్పుడు నాకూ డైరెక్షన్ చేయాలని అనిపిస్తోంది. మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చెప్పలేం కదా. కానీ నాకు ఇప్పుడు రైటింగ్ పై బాగా ఇంట్రస్ట్ ఉంది. రైటింగ్ అయితే ఖచ్చితంగా చేయాలని ఉంది.

 

మీరు వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తున్నారా ?

చేస్తున్నాను. ‘ఈ నగరానికి ఏమైంది 2’ వెబ్ సిరీస్ చేస్తున్నాను. తరుణ్ భాస్కరే స్టోరీ డైలాగ్స్ రాశాడు. స్క్రిప్ట్ చాల బాగుంది.

 

మీ తదుపరి సినిమాలు ఏమిటి ?

జయంత్ సి పరాన్జీగారి దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే సుశాంత్ గారి సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తున్నాను. అలాగే నితిన్ ‘రంగ్ దే’ సినిమాలో కూడా మంచి రోల్ చేస్తున్నాను.

తాజా వార్తలు