ఓటిటి లో మంచి రెస్పాన్స్ తో కొనసాగుతున్న అభినవ్ గోమఠం మూవీ

ఓటిటి లో మంచి రెస్పాన్స్ తో కొనసాగుతున్న అభినవ్ గోమఠం మూవీ

Published on Apr 13, 2024 12:29 AM IST

నటుడు, కమెడియన్ అభినవ్ గోమఠం ఇటీవల సేవ్ ది టైగర్స్ సిరీస్ తో పాటు అక్కడక్కడ పలు సినిమాల్లో కూడా నటించారు. ఇక ఇటీవల ఆయన హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా.

తిరుపతిరావు తెరకెక్కించిన ఈ మూవీలో వైశాలి రాజ్ హీరోయిన్ గా నటించగా కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై భవాని కాసుల, ఆరెంరెడ్డి, ప్రశాంత్ వి గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. సంజీవ్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి పర్వాలేదనిపించే విషయం అందుకుంది.

విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఇక ఈ మూవీ ప్రైమ్ లో 60 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ ని సొంతం చేసుకుని దూసుకెళుతోంది. కాగా తమ మూవీకి ఓటిటిలో ఆడియన్స్ అందిస్తున్న మంచి రెస్పాన్స్ కి మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు