లవ్ స్టోరీతో ఎంట్రీ ఇస్తానంటున్న స్టార్ హీరో తమ్ముడు

లవ్ స్టోరీతో ఎంట్రీ ఇస్తానంటున్న స్టార్ హీరో తమ్ముడు

Published on Jun 7, 2020 3:03 PM IST

టాలీవుడ్ లో బడా ఫ్యామిలీలలో ఒకటిగా ఉన్న దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఓ యంగ్ ఫెలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎవరో కాదు స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్. ఈయన వెండి తెర ఎంట్రీ పై అనేక పుకార్లు ఎప్పటి నుండో చక్కర్లు కొడుతుండగా తాజాగా అభిరామ్ స్పందించారు. తన తాత గారైన మూవీ మొఘల్ రామానాయుడు జయంతి సంధర్భంగా మీడియా ముందుకు వచ్చిన అభిరామ్ పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

అభిరామ్ సినిమాలోకి రావడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాడట. అలాగే ఓ మంచి ప్రేమ కథతో తన వెండితెర ఎంట్రీ ఉంటుందని అభిరామ్ చెప్పడం గమనార్హం. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ స్టార్ హీరో అయ్యారు. ఇక అభిరామ్ అన్న రానా ఇండియా లెవెల్ లో పలు భాషలలో నటించిన పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నారు. మరి అదే కుటుంబం నుండి రానున్న అభిరామ్ ఎంత వరకు విజయం సాధిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు