
మణిరత్నం.. తనదైన బ్రాండ్, ప్రేక్షకులను మ్యాజిక్ చేసే సినిమాలతో మెప్పించి దేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న దర్శకుడు. ఈమధ్యే ‘ఓకే బంగారం’తో చాన్నాళ్ళ తర్వాత ఒక మంచి హిట్ కొట్టి ‘మణి ఈజ్ బ్యాక్’ అనిపించుకున్న ఈ లెజెండరీ డైరెక్టర్, తన కొత్త సినిమా కోసం సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. కార్తీ, దుల్కర్ సల్మాన్‌లు ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇక అనౌన్స్ అయిన రోజునుంచే మంచి ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోన్న ఈ సినిమా టెక్నికల్‌గానూ మణి స్టైల్ సినిమా ఫీల్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను సింక్ సౌండ్‌తో తెరకెక్కించాలని భావిస్తున్నారట. ఇండియన్ సినిమాల్లో సౌండ్ సింక్‌తో తెరకెక్కే సినిమాలు చాలా తక్కువ. మణిరత్నం తన సినిమాకు ఓ మంచి న్యాచురల్ ఫీల్ తీసుకురావాలన్న ఆలోచనలో ఈ దిశగా పలు ప్రయోగాలు చేశారు. ఓకే బంగారం సినిమాను కూడా సౌండ్ సింక్‌తో లొకేషన్లోనే రికార్డింగ్ చేసి మెప్పించిన మణి, తన కొత్త సినిమాను కూడా అదే కోవలో తెరకెక్కించనున్నారు. డబ్బింగ్ వర్క్ అనేది ప్రధానంగా కనిపించే ఇండియన్ సినిమాల్లో ఈ ప్రయత్నం కొత్తగా కనబడుతూ ఆసక్తికరంగా మారింది.