అనుకున్న దానికంటే ఎక్కువగానే “ఆచార్య”.!

Published on Mar 5, 2021 12:00 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు పూజా హెగ్డేలు మరో కీలక పాత్రల్లో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మెగా మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య”. ఇప్పటికే భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ప్రతీ రోజు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ అంచనాలు మరింత చేసుకుంటూ వెళ్తుంది.

అయితే ఈ చిత్రానికి సంబంధించి మాత్రం నెవర్ బిఫోర్ బిజినెస్ జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా కొన్ని ఏరియాల్లో అయితే ఆచార్య సెన్సేషన్ నే నమోదు చేస్తుందని అంటున్నారు. సరే ఇదంతా బాగానే ఉన్నా అంచనాలకు మించి ఇదంతా వెళ్తుందని టాక్ కూడా వస్తుంది. మరి ఇదంతా ఎంత వరకు ఈ సినిమాకు ప్లస్ అవుతుంది లేక మైనస్ అవుతుంది అన్నది చూడాలి. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటెర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :