మెగాస్టార్ సినిమా రిలీజ్ డేట్ అప్పుడేనట !

Published on Mar 4, 2020 2:46 pm IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ‘చిరు 152వ’ ఆచార్య సినిమా ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా అనుకున్నంత వేగంగా షూటింగ్ జరగట్లేదని ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. కాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి మేకర్స్‌ ను అనుకున్న డేట్ లు ప్రకారమే పనిచేయాలని.. అనుకున్నట్లుగానే సినిమాను విడుదల చేయాలని కోరారు. దాంతో చిత్రబృందం శరవేగంగా షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. కాబట్టి ఈ చిత్రం ఆగస్టు 14 న విడుదల కానుంది.

ఇక మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారట. ఇప్పటికే మణిశర్మ ఈ చిత్రానికి ట్యూన్లను కూడా సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక మాస్ సాంగ్ ఉందట, ఆ సాంగ్ మాస్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉంటుందట. ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది. మొత్తంగా చెప్పాలంటే మెగాస్టార్ – కొరటాల నుండి ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రానుంది.

సంబంధిత సమాచారం :

More