యాక్షన్ మోడ్ లో రామ్ ‘పండగ చేస్కో’

యాక్షన్ మోడ్ లో రామ్ ‘పండగ చేస్కో’

Published on Sep 17, 2014 3:52 PM IST

ram-pothineni
ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న’పండగ చేస్కో’ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ రోజు ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ ఎపిసోడ్ ని హైదరబాద్ లో షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ లో రామ్ తో పాటు సినిమాలోని ప్రధాన నటులు కూడా పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమైన ఈ హైదరాబాద్ షెడ్యూల్ లో మొదటి రెండు రోజులు కొన్ని సన్నివేశాలను షూట్ చేసారు.

ఈ షెడ్యూల్ తర్వాత చివరి షెడ్యూల్ ని అక్టోబర్ లో మొదలు పెట్టనున్నారు. రామ్ సూపర్ స్టైలిష్ గా కనిపించనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. బలుపు తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి వెలిగొండ శ్రీనివాస్ కథని అందించారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు