
సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి సిద్దపడే యంగ్ హీరోస్ లో మంచు విష్ణు కూడా ఒకరు. ప్రతి సినిమా కథలోనూ, తన పాత్రలోనూ సరికొత్త వైవిధ్యాన్ని ట్రై చెయ్యడానికి ఇష్టపడే విష్ణు గత సినిమాల్లో డిఫరెంట్ డిఫరెంట్ పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు మంచు విష్ణు హీరోగా రానున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘డైనమైట్’. హై రేంజ్ ఇంటెన్స్ ఉన్న సినిమాలు తీసిన దేవకట్టా ఈ సినిమాకి దర్శకుడు. మంచు విష్ణు సరసన అందాల భామ ప ప్రణిత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన థ్రిల్లర్ సినిమా.
ఈ సినిమా కోసం మంచు విష్ణు స్పెషల్ గా తన బాడీని టోన్ చేసుకోవడమే కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ పై స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి. రోమాలు నిక్కబొడుచుకునేలా విజయ్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి స్పెషల్ హైలైట్ అవుతాయని ఈ చిత్ర టీం అంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలోనే సెన్సార్ కి వెళ్లనున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సూపర్బ్ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమా విక్రమ్ ప్రభు హీరోగా, ప్రియ ఆనంద్ హీరోయిన్ గా తమిళంలో ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి’కి రీమేక్. మంచు మోహన్ బాబు సమర్పణలో ప్రతిష్టాత్మకమైన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

