విజయ్ ఆంటోనీ సినిమాలో యాక్షన్ కింగ్ !

విజయ్ ఆంటోనీ సినిమాలో యాక్షన్ కింగ్ !

Published on May 18, 2018 1:27 AM IST

యాక్షన్ కింగ్ ‘అర్జున్’ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో నటిస్తున్న అర్జున్ ఇటీవల రిలీజ్ అయినా నాపేరు సూర్య లో బన్నీకి తండ్రిగా నటించాడు. అంతేగాక తాజాగా తమిళంలో విడుదలై ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న విశాల్ నటించిన ‘ఇరుంబు తేరై’ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించి మెప్పించాడు .ఈ సినిమా తెలుగులో ‘అభిమన్యుడు’ గా రాబోతుంది. తెలుగులో ‘ఒకే ఒక్కడు, జెంటిల్మెన్’సినిమాలతో అభిమానులని సంపాదించుకున్న అర్జున్50 సంవత్సరాల వయసులోకూడా ఫిటెనెస్ ను మెంటైన్ చేస్తూ యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తున్నాడు .

ఇప్పుడు తాజాగా అర్జున్ మరోక సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు ‘ బిచ్చగాడు’ఫెం విజయ్ ఆంటోనీ హీరో గా నూతన దర్శకుడు ఆండ్రు తెరకెక్కిన్చే’కోలైక్కరేన్’ లో సినిమాలో నటించనున్నాడు. విజయ్ ఆంటోనీ సినిమాలు తమిళ్ తో పాటు తెలుగు భాషలో డబ్ అవుతుంటాయి. కనుక ఈ సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవ్వడం ఖాయం .ప్రస్తుతం విజయ్ ఆంటోనీ నటించిన ‘కాశి’ చిత్రం రేపు తెలుగులో విడుదల కానుంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు