
మాస్ మహారాజ్ రవితేజ – టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కిక్ 2’. 2009లో తెలుగు ప్రేక్షకులకు సూపర్బ్ ‘కిక్’ ఇచ్చిన సినిమాకి సీక్వెల్ అయిన ఈ సినిమాకి సురేందర్ రెడ్డి డైరెక్టర్. సెన్సార్ నుండి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా ఆగష్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ కి మరో 2 రోజులు మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని జోరుగా సాగుతున్నాయి. కిక్ సినిమాలో లానే ఈ సినిమాలో కూడా హై రేంజ్ కామెడీ ఉండనుంది. ఆ హై రేంజ్ కామెడీ కోసం టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందంతో పాటు బాలీవుడ్ కమెడియన్స్ రాజ్పల్ యాదవ్, సంజయ్ మిశ్రాలు కూడా ఉన్నారు.
కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఈ సినిమాలో తెలుగు ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉండనున్నాయి. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ బాగా పండాలి అంటే హీరోకి ఎదురొచ్చే విలన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకోసమే రేసుగుర్రం ఫేం రవి కిషన్, జిల్ ఫేం కబీర్ సింగ్ లు విలన్స్ గా ఎంచుకున్నారు. స్క్రీన్ మీద ముగ్గురు ఆరడుగుల ఆజానుబాహుల మధ్య పోటీ జరుగుతుంటే చూడటానికి చాలా బాగుంటుందని ఈ చిత్ర టీం తెలిపింది. రవితేజ కూడా టాలీవుడ్ లో మునుపెన్నడూ చూడని స్టైల్ లో ఈ స్టంట్స్ ఉంటాయని అన్నారు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు.

