ఘ‌నంగా అర్జున్ కూతురు ఐశ్వ‌ర్య‌ వివాహం

ఘ‌నంగా అర్జున్ కూతురు ఐశ్వ‌ర్య‌ వివాహం

Published on Jun 11, 2024 4:00 PM IST

యాక్ష‌న్ కింగ్ అర్జున్ స‌ర్జా కూతురు ఐశ్వ‌ర్య స‌ర్జా వివాహం జూన్ 10న ఘ‌నంగా జ‌రిగింది. చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగాంజనేయస్వామి మందిరంలో ఈ వివాహ వేడుకను నిర్వ‌హించారు. ప్ర‌ముఖ త‌మిళ హాస్య న‌టుడు తంబి రామ‌య్య కుమారుడు ఉమాప‌తితో ఐశ్వ‌ర్య వివాహం క‌న్నుల పండుగ‌గా జ‌రిగింది.

జూన్ 7న హ‌ల్దీ కార్య‌క్ర‌మంతో ప్రారంభ‌మైన ఈ వివాహ వేడుక‌లో జూన్ 8న సంగీత్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఇక జూన్ 10న ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల మ‌ధ్య కుటుంబ స‌భ్యులు, సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఇరువురి వివాహం జ‌రిగింది. అతిథులు నూత‌న వధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

కాగా, వీరి రిసెప్ష‌న్ వేడుకను జూన్ 14న చెన్నైలోని లీలా ప్యాలెస్ లో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో ఉమాప‌తి-ఐశ్వ‌ర్య‌ల వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అభిమానులు వారికి అభినందన‌ల‌ను తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు