ప్రముఖ టాలీవుడ్ నటుడు, జిస్మత్ రెస్టారెంట్స్ అధినేత ధర్మ మహేష్ గుంటూరులో ‘జిస్మత్ జైలు మండి’ మూడవ బ్రాంచ్‌ను డిసెంబర్ 11న ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది అభిమానులతో భారీ బైక్ ర్యాలీగా విచ్చేసిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. సాయంత్రం 6 గంటలకు జరిగిన ఈ వేడుకలో మహేష్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు కాకాని అరుణ, వెంకటేశ్వరరావు, సోదరి కాకాని భాగ్యలక్ష్మి, న్యాయ సలహాదారు ఎన్. నాగూర్ బాబు పాల్గొన్నారు.
2017లో గుంటూరు కేంద్రంగా ‘గిస్మత్ అరబిక్ మండి’గా మొదలైన ఈ ప్రస్థానం, నేడు తెలుగు రాష్ట్రాల్లో 17కు పైగా శాఖలతో విస్తరించింది. జైలు మండి థీమ్‌తో వినియోగదారుల ఆదరణ పొందిన ఈ సంస్థను, విస్తరణలో భాగంగా ఇటీవల ‘జిస్మత్ రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్’గా మార్చారు.
ఈ సందర్భంగా ధర్మ మహేష్ మాట్లాడుతూ, తన కుమారుడు జగద్వాజ పేరులోని మొదటి అక్షరం ‘J’ కలిసేలా ‘జిస్మత్’ (Jismat) అని నామకరణం చేశానని, ఇది తనకు ఎంతో భావోద్వేగమైన విషయమని పేర్కొన్నారు. గుంటూరులో ఈ బ్రాంచ్ ప్రారంభం తమ వ్యాపార విస్తరణలో కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు.
