తన తండ్రి పై కేసు పెట్టిన ప్రముఖ నటుడి కుమార్తె !

తన తండ్రి పై కేసు పెట్టిన ప్రముఖ నటుడి కుమార్తె !

Published on Oct 23, 2018 5:34 PM IST


హీరో పాత్రలతో పాటు నెగెటివ్ పాత్రలు కూడా పోషించే కోలీవుడ్ నటుడు దునియా విజయ్ ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కుని జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. కాగా తాజాగా దునియా విజయ్ పై మరో కొత్త కేసు నమోదైంది. అయితే ఈ కేసు పెట్టింది ఆయన కూతురే కావడం సర్వత్రా ఆసక్తి రేపుతుంది. విజయ్ కి అతని మొదటి భార్య నాగరత్నకు ఒక కూమార్తె ఉన్నారు. ఆమె పేరు మోనిక, వయసు 19 సంవత్సరాలు.

కాగా తన తండ్రి అయిన దునియా విజయ్ తనపై చేయి చేసుకున్నాడని మోనిక సోమవారం రాత్రి కేసు పెట్టింది. అయితే ఈ విషయం పై స్పందించిన దునియా విజయ్ ‘మోనిక నాకు కూతురు. ఆమెను ఎందుకు కొడతాను. నిజానికి మోనికను ఎవ్వరూ ఏమీ అనలేదు, కానీ మోనిక, తన తల్లి నాగరత్న చెప్పిన విధంగా చేస్తోంది. అందుకే నా పై ఆరోపణలు చేస్తూ.. కేసు కూడా పెట్టిందని దునియా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు