​హీరోగా మారుతున్న ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ మహేష్ యాదవ్

నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన మహేష్ యాదవ్.. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు. ఆ చిత్రంలో ఆయన పోషించిన ల్యాబ్ అసిస్టెంట్ పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రోత్సాహంతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు.

​ఆ తర్వాత ‘కీడాకోలా’, ‘భామాకలాపం’, ‘సత్తిగాని రెండెకరాలు’, ‘భీమ్లానాయక్’, ‘స్కైలాబ్’, ‘ఇంటింటి రామాయణం’ తదితర చిత్రాల్లో నటించారు. ఇటీవలే వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలో కోటిసార్ పాత్రతో మెప్పించారు. సినిమాలతో పాటు ‘రాముల’, ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’, ‘మాయాబజార్’ లాంటి ప్రముఖ వెబ్ సిరీస్‌లలోనూ నటించారు. చిరంజీవి, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావుల స్ఫూర్తితో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునే ప్రయత్నంలో ఉన్నారు.

​ప్రస్తుతం మహేష్ యాదవ్ పలు ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘బద్మాషులు’ చిత్రంలో హీరోగా నటిస్తుండగా.. ‘ఈ నగరానికి ఏమైంది 2’, రవితేజ ‘ఇరుముడి’, ఆనంద్ దేవరకొండ ‘తక్షకుడు’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్టుల వివరాలను ఆయన పంచుకున్నారు.

Exit mobile version