‘హ్రీం’ హీరో పవన్ తాతా పుట్టినరోజు వేడుకలు.. హాజరైన హీరో నందు

‘హ్రీం’ హీరో పవన్ తాతా పుట్టినరోజు వేడుకలు.. హాజరైన హీరో నందు

Published on Feb 2, 2026 8:00 AM IST

‘హ్రీం’

శివమ్ మీడియా పతాకంపై పవన్‌ తాతా, చమిందా వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘హ్రీం’. శివమల్లాల నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్‌ రావూరి దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం చిత్ర కార్యాలయంలో హీరో పవన్‌ తాతా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యువ హీరో నందు, పవన్‌కు శుభాకాంక్షలు తెలిపి చిత్ర బృందాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ.. ‘హ్రీం’ గ్లింప్స్‌, పోస్టర్స్ చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాయని, పవన్‌కు మంచి టాలెంట్ ఉందని కొనియాడారు. నిర్మాత శివమల్లాల తనకు ఇండస్ట్రీలో వెల్ విషర్ అని, ఆయనతో ఎంతో అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. మాటీవీలో పనిచేసి దర్శకుడిగా మారుతున్న రాజేష్‌కు, హీరో పవన్‌కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని ఆకాంక్షించారు.

హీరో పవన్ మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యుల సమక్షంలో, ‘హ్రీం’ టీమ్‌తో పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉందనన్నారు. సినిమా కంటెంట్ ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని నిర్మాత శివమల్లాల తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ చమిందా వర్మ, సుజాత మల్లాల తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు