నల్ల నాగప్పగా పార్తిబన్.. పవన్ ని ఢీ కొట్టే డైనమిక్ విలన్ లుక్ చూసారా!

Ustaad-Bhagat-Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఓజి లాంటి భారీ హిట్ తర్వాత వస్తున్న లేటెస్ట్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ రిలీజ్ కి దగ్గరకి వస్తుండగా అభిమానులు వరుస అప్డేట్స్ ని ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మేకర్స్ లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.

ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు ‘యుగానికి ఒక్కడు’ ఫేమ్ పార్తిబన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో తాను విలన్ రోల్ చేస్తున్నట్టుగా కూడా అందరికీ తెలుసు. ఇక ఫైనల్ గా తనపై అధికారిక ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ ఇప్పుడు వదిలారు. మరి ఈ సినిమాలో తాను నల్ల నాగప్ప అనే పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తారని కన్ఫర్మ్ చేసారు.

ఇక ఈ లుక్ లో పార్తిబన్ మంచి డైనమిక్ గా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో అదిరారు. మరి పవన్ తో కాంబినేషన్ సీన్స్ ని హరీష్ శంకర్ ఏ లెవెల్లో రాసుకున్నారో కానీ థియేటర్స్ లో మాత్రం వీరి సీన్స్ మంచి పవర్ ప్యాకెడ్ గా ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా ఈ మార్చ్ 26న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version