అల్లూరి సీతారామరాజు వేషధారణలో భోగాపురం ఎయిర్‌పోర్టులో ‘మన్యం ధీరుడు’ నటుడి సందడి

Actor RVV Satyanarayana

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో భాగంగా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తొలి అంతర్జాతీయ ప్రయాణికుడికి నటుడు ఆర్.వి.వి. సత్యనారాయణ స్వాగతం పలికారు. ‘మన్యం ధీరుడు’ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించిన ఆయన, అదే వేషధారణలో ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రయాణికుడిని సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆర్.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన భోగాపురం విమానాశ్రయ ప్రారంభ వేడుకల్లో పాలుపంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు నడయాడిన గడ్డపై అదే రూపంలో వచ్చి తొలి ప్రయాణికుడికి స్వాగతం పలికే అవకాశం కల్పించినందుకు విమానాశ్రయ యాజమాన్యానికి, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు తాను కథానాయకుడిగా నటించిన ‘మన్యం ధీరుడు’ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో ప్రసారమవుతోందని వెల్లడిస్తూ, ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Exit mobile version