ది ప్యారడైజ్ : బుల్లెట్ తగిలితే చనిపోయినట్టేనా? ట్రోల్స్‌పై క్లారిటీ వచ్చేసిందిగా..!

ది ప్యారడైజ్ : బుల్లెట్ తగిలితే చనిపోయినట్టేనా? ట్రోల్స్‌పై క్లారిటీ వచ్చేసిందిగా..!

Published on Sep 26, 2026 6:04 PM IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’లో ఇంటర్వెల్ సీన్‌పై వస్తున్న విమర్శలపై నటుడు సాయి కిరణ్ స్పందించారు. ఈ సినిమాలో సాయి కిరణ్ పాత్రకు తుపాకీ బుల్లెట్ తగిలిన తర్వాత, సెకండాఫ్‌లో ఆయన మళ్ళీ ప్రత్యక్షం కావడంపై ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆ పాత్ర చనిపోయిందని భావించిన ప్రేక్షకులకు, సెకండాఫ్‌లో ఆయన కనిపించడం కాస్త అయోమయానికి గురిచేసింది. ఈ విషయంపై తాజాగా జరిగిన సక్సెస్ మీట్ ఈవెంట్‌లో సాయి కిరణ్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. “ఇంటర్వెల్‌లో నా పాత్రకు బుల్లెట్ గాయమై కింద పడటం మాత్రమే చూపించారు తప్ప, ఎక్కడా చనిపోయినట్లు చూపించలేదు. పైగా సెకండాఫ్‌లో ఆ బుల్లెట్ తగిలిన చోట నేను బ్యాండేజ్‌తో కనిపిస్తాను. సినిమాను మరోసారి జాగ్రత్తగా గమనించి ఆ బ్యాండేజ్ ఫోటోలను నాకు పంపండి” అని ఆయన క్లారిటీ ఇచ్చారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మోహన్ బాబు, సొనాలీ కులకర్ణి, రాఘవ్ జుయల్, కయాదు లోహర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు