ఆటపాటలతో నటి అర్చన సంగీత్ !

ఆటపాటలతో నటి అర్చన సంగీత్ !

Published on Nov 12, 2019 7:00 AM IST

archana1

తెలుగు అందాల తార అర్చన ఇంట పెళ్లి సందడి మొదలైంది. పారిశ్రామికవేత్త జగదీష్‌ తో నటి అర్చన వివాహం జరగనున్న విషయం తెలిసిందే. 13వ తేదీ సాయంత్రం వివాహ రిసెప్షన్ జరగనుండగా.. 14 తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెళ్లి వేడుక జరిగే గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో సంగీత్ కార్యక్రమాన్ని ఆటపాటల నడుమ సందడిగా నిర్వహించారు.

వధువరులు అర్చన, జగదీష్ సినిమా పాటలకు స్టెప్పులేస్తూ కార్యక్రమాన్ని హుషారెత్తించారు. అర్చన స్నేహితులైన శివబాలాజీ-మధుమిత దంపతులు కూడా ఈ కార్యక్రమంలో వధువరులతో పాటు ఆడిపాడారు. ఎంతో ఘనంగా జరిగిన సంగీత్ కార్యక్రమంలో అర్చన, జగదీష్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు