‘జననాయగన్‌’ విడుదల పై నటి క్లారిటీ !

Jana Nayagan

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ జోసెఫ్‌ విజయ్‌ సేవలు అందిస్తున్నారు. ఐతే, విజయ్ నటించిన ‘జననాయగన్’ విడుదలపై రోజుకో వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా విడుదల తేదీ ఇదే అంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తల పై నటి ప్రియమణి ఓ ఈవెంట్‌ లో మాట్లాడుతూ.. ‘నాకు మాత్రం ఇంకా కచ్చితమైన విడుదల తేదీ తెలియదు, కానీ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు. రిలీజ్ కోసం నిర్మాత కసరత్తులు చేస్తున్నారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

పైగా జులై నెలాఖర్లోనే ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని ప్రియమణి హింట్ కూడా ఇవ్వడం విశేషం. ఇక ఈ సినిమా అప్‌ డేట్‌ తో పాటు విజయ్‌ రాజకీయప్రస్థానం గురించి కూడా ప్రియమణి మాట్లాడుతూ.. ‘విజయ్ గారు సాధించిన విజయాన్ని చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన ప్రజలకు సేవచేయడం కోసమే పుట్టారని నాకు అనిపిస్తుంటుంది. విజయ్‌ పుట్టకతోనే నాయకుడు’ అంటూ ప్రియమణి తెలిపింది.

Exit mobile version