లైంగిక వేధింపుల వల్లే నటనకు దూరమయ్యా !

Published on Jun 1, 2020 7:13 pm IST


సినీ పరిశ్రమల్లో ఆ మధ్య మొదలైన ‘మీటూ’ ఉద్యమం మొత్తానికి ఇప్పటికి కూడా ఎవరొక హీరోయిన్ కారణంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా తమిళ నటి కల్యాణి ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల నుంచి వచ్చిన లైంగిక వేధింపులు కారణంగానే తాను నటనకు దూరమయ్యానని కామెంట్స్ చేసింది. ఈమె తెలుగులో ‘మళ్లీ మళ్లీ’ అనే సినిమాలో నటించింది. అలాగే తమిళంలో తెరకెక్కిన ‘జయం’, ‘అలై తండా వానమ్‌’, ‘ఎస్‌ఎంఎస్‌’ సినిమాలతో అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సినిమాలతో సీరియల్స్‌ తో కూడా నటించి మెప్పించిన ఈమె కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే బుల్లితెరలో కూడా తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని దాంతో నేను నటనకు దూరమయ్యాను. ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాను’ అని కల్యాణి చెప్పుకొచ్చింది. ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా ఇప్పటికే కొందరు నటీమణులు తమకు ఎదురైన చేదు సంఘటనలు వేధింపులను బాహాటంగానే చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :

More