బాలకృష్ణ పై లయ కామెంట్స్.. చాలా ప్రొఫెషనల్ అంటూ కితాబు..!

బాలకృష్ణ పై లయ కామెంట్స్.. చాలా ప్రొఫెషనల్ అంటూ కితాబు..!

Published on Feb 12, 2026 7:00 AM IST

Laya

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నటి లయ (Laya). స్వయంవరం, మనోహరం వంటి సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఆమె, ‘ప్రేమించు’ చిత్రంలో అంధురాలిగా తన నటనకు గానూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ అగ్ర కథానాయకులందరి సరసన నటించి మెప్పించారు. వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడిన లయ, సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ తెలుగు తెరపై మెరవడానికి సిద్ధమయ్యారు.

ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆమె, నందమూరి బాలకృష్ణతో తనకున్న వర్కింగ్ రిలేషన్‌షిప్‌ను గుర్తు చేసుకున్నారు. ‘విజయేంద్ర వర్మ’ చిత్రంలో ఆయనతో కలిసి నటించిన లయ, బాలయ్యను చాలా ప్రొఫెషనల్ నటుడని అభివర్ణించారు. “సెట్స్‌లో ఆయన ఎప్పుడూ సరదాగా ఉంటూ అందరినీ నవ్విస్తారు. ఆయన క్రమశిక్షణ మరియు సహనటులకు ఇచ్చే గౌరవం అద్భుతం” అంటూ బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని కొనియాడారు.

ప్రస్తుతం లయ నటించిన తాజా చిత్రం ‘సంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని’. సుధీర్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఆమె ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం తొలుత ఓటీటీలో రిలీజ్ కావాల్సి ఉన్నా, ఇప్పుడు నేరుగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

తాజా వార్తలు