మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. రవికుమార్ సీరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటి రాశీ ‘సావిత్రి’ అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఆమె ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
కథను మలుపు తిప్పే ఈ పాత్రలో రాశీ సాధారణ గెటప్‌లో ఇంటెన్స్‌గా కనిపిస్తారని మేకర్స్ తెలిపారు. బ్యాగ్ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ మోపురి సంగీతం అందిస్తుండగా, ప్రియేష్ గురుసామి ఛాయాగ్రాహకుడిగా, శివ శర్వాని ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు తుది దశలో ఉన్నాయి. త్వరలోనే చిత్ర టీజర్‌ను విడుదల చేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.
