మూడు నెలలు జైల్లో ఉన్నాక బెయిల్ పొందిన హీరోయిన్

Sanjana Galrani

కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హీరోయిన్లు సంజన గల్రాని, రాగిణి ద్వివేదిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగుళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో వీరిద్దరూ రిమాండ్లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ మంజారు చేసుకున్నప్పటికీ న్యాయస్థానం తిరస్కరిస్తూ వచ్చింది. అలా పలుమార్లు తిరస్కరణకు గురైన సంజన బెయిల్ పిటిషన్ ను ఎట్టకేలకు కోర్టు ఆమోదించింది.

ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్న కారణంగా బెయిల్ మంజూరు చేయాలని తాజాగా ఆమె పిటిషన్ పెట్టుకోగా కోర్టు అంగీకరించింది. 3 లక్షల వ్యక్తిగత బాండ్‌తో పాటు ఇద్దరు వ్యక్తులు పూచీకత్తుని సమర్పించాలని, పోలీసులకు ఎలాంటి సమాచారం అడిగినా ఇవ్వాలని, విచారణకు హారజరవ్వాలని, దర్యాప్తుకు సహకరించాలని, వారంలో రెండు సార్లు కోర్టులో సంతకం చేయాలని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయకూడదనే పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. దాదాపు మూడునెలలు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ మంజూరు కావడంతో సంజన ఊపిరి పీల్చుకుంది.

Exit mobile version