వైరల్ పిక్: యంగ్ టైగర్ తో ఊర్వశి రౌతేలా జిమ్ సెల్ఫీ!

వైరల్ పిక్: యంగ్ టైగర్ తో ఊర్వశి రౌతేలా జిమ్ సెల్ఫీ!

Published on Apr 15, 2024 12:54 PM IST

గ్లామరస్ నటి ఊర్వశి రౌతేలా తదుపరి తెలుగు చిత్రం NBK109 చిత్రం లో కనిపించనున్నారు. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ రోజు ఉదయం ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోకి వెళ్లి టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో జిమ్‌లో దిగిన సెల్ఫీని పోస్ట్ చేసింది. ఈ ఫోటో కి సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించలేదు.

ఈ ఫోటోను షేర్ చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే తన బాలీవుడ్ తొలి చిత్రం వార్ 2 సెట్స్‌లో చేరాడు. హిందీ బిగ్గీలో, అతను స్టార్ నటుడు హృతిక్ రోషన్‌తో స్క్రీన్‌ను షేర్ చేసుకోనున్నారు. దేవర: పార్ట్ 1 సెట్స్‌లో చేరడానికి అతను త్వరలో హైదరాబాద్‌కు తిరిగి వస్తాడని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు