సాయి ధరమ్ తేజ్ సరసన ఆద శర్మ

adah-sharma

మెగా కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్ ‘. మాస్ ని ఆకట్టుకునే డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మాస్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆద శర్మ ఇందులో ఓ అతిధి పాత్ర పోషించనుంది. ఆద శర్మ కనిపించేది కొద్ది సేపే అయినా తన పాత్ర సినిమాకి చాలా కీలకం అని సమాచారం. పూర్తి కమర్షియల్ హంగులతో సినిమా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇండియాలోని పలు ప్రాంతాల్లో షూట్ చేయనున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ని ఏప్రిల్ లో అమెరికాలో షూట్ చేయనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version