ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ఆదా శర్మ “బస్టర్ ది నక్సల్ స్టోరీ”

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ఆదా శర్మ “బస్టర్ ది నక్సల్ స్టోరీ”

Published on May 17, 2024 3:00 PM IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఆదా శర్మ రీసెంట్ గా నటించిన మరో కాంట్రవర్సియల్ చిత్రం “బస్టర్ ది నక్సల్ స్టోరీ” కోసం తెలిసిందే. ఆదా శర్మ లాస్ట్ సెన్సేషనల్ హిట్ చిత్రం “ది కాశ్మీర్ ఫైల్స్” చిత్రం తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఇది కూడా ఆ రేంజ్ సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు కానీ ఇది భారీ డిజాస్టర్ అయ్యింది. పైగా ఆ సినిమాకి ఈ సినిమాకి కూడా దర్శకుడు సుదీప్తో సేన్ నే పని చేయగా “బస్టర్ ది నక్సల్ స్టోరీ” కాస్త డిజాస్టర్ అయ్యి మినిమమ్ వసూళ్లు కూడా రాబట్టలేదు.

అయితే ఈ చిత్రం ఇప్పుడు ఎట్టకేలకి ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ జీ5 వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం నేటి నుంచి ఒరిజినల్ హిందీ సహా డబ్బింగ్ తెలుగు భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు జీ 5 లో స్ట్రీమ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి బిషాక్ జ్యోతి సంగీతం అందించగా సన్ షైన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు