“కేజీయఫ్ 2” కోసం అధీరా ఆల్ సెట్..!

ప్రస్తుతం మన సౌత్ ఇండియా నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. భారీ అంచనాలను నెలకొల్పుకున్నా ఈ చిత్రం కోసం మొత్తం అన్ని ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇపుడు షూట్ లో అంతిమ దశకు చేరుకున్న ఈ చిత్రంలో ఇంకా కేవలం కొన్ని కీలక సాలిడ్ షాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ యష్ పోషిస్తున్న రాకీ భాయ్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అంతే స్థాయిలో బలంగా ఉండే ప్రతినాయక పాత్ర బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ అధీరా గా కనిపించనున్నాడు. ఈ రోల్ కోసం అధీరా ఇప్పటికే చాలా షూట్ ను కంప్లీట్ చేసుకున్నాడు.

అలాగే ఆ మధ్య కాన్సర్ బారిన పడి షూట్ కు మళ్ళీ పాత హైర్ స్టైల్ కూడా చేసారు. అంతే కాకుండా ఇప్పుడు లుక్ ను ప్రిపేర్ చేసేసుకుని ఫోటో షూట్ ను కంప్లీట్ చేసి కేజీయఫ్ షూట్ కోసం ఆల్ సెట్ చేసేసినట్టుగా తెలిపారు. ఈ భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి రేస్ లో నిలపాలి అని మేకర్స్ ట్రై చేస్తున్నారు.

Exit mobile version