త్వరలో మార్కెట్లోకి రానున్న అధినాయకుడు ఆడియో

త్వరలో మార్కెట్లోకి రానున్న అధినాయకుడు ఆడియో

Published on Nov 28, 2011 3:38 PM IST


బాలకృష్ణ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అధినాయకుడు’. ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం
ప్రకారం కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన అధినాయకుడు ఆడియోని డిసెంబరు 25 న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో జయసుధ గారు బాలకృష్ణకి బామ్మగా కనిపించనున్నారు.
బాలకృష్ణ వేసిన ముసలాయన గెటప్ కి ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణ లభించనుంది.

శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎమ్.ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. బాలకృష్ణకి జోడీగా లక్ష్మి రాయ్ మరియు సలోని నటించనున్నారు. అధినాయకుడు చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు