‘ఆదిపురుష్’ ఆగే ప్రసక్తే లేదట !

‘ఆదిపురుష్’ ఆగే ప్రసక్తే లేదట !

Published on Feb 12, 2021 9:02 PM IST


ప్రభాస్ సైన్ చేసిన భారీ బడ్జెట్ పిరియాడికల్ మూవీ ‘ఆదిపురుష్’ 10 రోజుల క్రితం ముంబైలో అట్టహాసంగా మొదలైంది. గోరేగాన్ స్టూడియోలో గ్రీన్ మ్యాట్, స్పెషల్ సెట్ వేసి టెస్ట్ షూట్ జరిపారు. కానీ షాక్ సర్క్యూట్ కారణంగా సెట్లో మంటలు చెలరేగడంతో సెట్ మొత్తం అగ్నికి ఆహుతైంది. గ్రీన్ మ్యాట్ సెటప్, కొన్ని కాస్ట్యూమ్స్ మంటల్లో పూర్తిగా కాలిపోయాయట. వాటితో పాటే త్రీడీ టెక్నాలజీకి సంబంధించిన ముఖ్యమైన పరికరాలు కూడ తగలబడిపోయాయి. దీంతో షూటింగ్ ఆగిపోయింది.

అయితే ప్రమాదం అనంతరం దర్శకుడు ఓం రౌత్ నిరుత్సాహపడకుండా తిరిగి పనులను స్టార్ట్ చేశారట. వేరొక స్టూడియోలో కొత్త సెట్ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారట ఆయన. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ సైతం కొత్త కాస్ట్యూమ్స్ సిద్ధం చేస్తున్నారట. ప్రస్తుతం ప్రభాస్ చాలా బిజీ హీరో. ఆయన కోసం ఎందరో దర్శకులు, నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి బిజీ సమయంలో ఆయన డేట్లు మిస్సైతే మళ్ళీ దొరకడం కష్టం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫిబ్రవరిలోనే షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు ఓం రౌత్. భూషణ్ కుమార్, కృషన్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో తెరకెక్కనుంది. ఇందులో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. 2022 ఆగష్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు