తమిళ ‘అర్జున్ రెడ్డి’ ని వదలని రిలీజ్ కష్టాలు

తమిళ ‘అర్జున్ రెడ్డి’ ని వదలని రిలీజ్ కష్టాలు

Published on Nov 6, 2019 10:27 AM IST

adithya

ఏ ముహూర్తాన అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ చిత్రం మొదలుపెట్టారో కానీ ఆ మూవీ థియేటర్స్ లోకి రావడం పెద్ద కార్యంలా తయారైంది. షూటింగ్ దశలోనే అనేక అవరోధాలు ఎదుర్కొన్న ఆదిత్య వర్మ చివరికి విడుదలకు కూడా అంతే కష్టాలు పడాల్సి వస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆదిత్య వర్మ మూవీ ప్రకటించినట్లు నవంబర్ 8న విడుదలయ్యే అవకాశం లేదట. నిన్న సెన్సార్ సర్టిఫికెట్ కొరకు వెళ్లిన ఈ చిత్రాన్ని చూసిన సభ్యులు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారట. ఐతే అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరేలా చేయాలని భావిస్తున్న నిర్మాతలు ఈ మూవీకి ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేయవలసిందిగా కోరారట. దీంతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో నిర్మాతలు ఆదిత్య వర్మ చిత్ర విడుదల తేదీ వెనక్కి జరిపే ఆలోచనలో ఉన్నారట.

ఆదిత్య వర్మ మూవీ సెట్స్ పైకి వెళ్లి ఏడాదికి పైనే ఐయ్యింది.అనేక స్థాయిలలో వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ కనీసం ఈ ఈవారం విడుదల అవుతుందని అందరూ భావించారు. కాగా తెలుగు మరియు హిందీలో సంచలన విజయం సాధించిన చిత్రం కావడంతో పాటు, స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ డెబ్యూ మూవీ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సమాచారంపై అధికారిక ప్రకటన ఏమీ లేని తరుణంలో మరి చూడాలి ఏమవుతుందో.

తాజా వార్తలు