టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్2 నేడు థియేటర్ల లో విడుదల అయ్యింది. ఈ చిత్రం సూపర్ సక్సెస్ ను సొంతం చేసుకోవడం తో చిత్ర యూనిట్ సెలబ్రేట్ చేసుకుంటోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హీరో నాని సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కి కొనసాగింపు గా మరొక పార్ట్ రానున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ హిట్ సీరిస్ కాన్సెప్ట్ తో చాలా ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. తాజాగా సోషల్ మీడియాలో హిట్ సీరిస్ పై ఒక ఆసక్తికరమైన కామెంట్స్ వచ్చాయి. ఇందులొ సమంత లీడ్ రోల్ లో నటిస్తే ఇలా ఉంటుంది అని. దీనికి హీరో అడివి శేష్ టెరిఫిక్ ఐడియా అంటూ చెప్పుకొచ్చారు. ఏమంటారు సమంత అంటూ చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
That’s a terrific idea! What do you say Sam? @Samanthaprabhu2 #HIT2 #BloodyBlockbuster #Hit2Review https://t.co/uOYQ86Cda6
— Adivi Sesh (@AdiviSesh) December 2, 2022