“మేజర్” ఎలా పుట్టింది..రివీల్ చేసిన శేష్.!

Published on Nov 27, 2020 10:15 am IST

మన టాలీవుడ్ లోకి తనదైన సినిమాలను పరిచయం చేసి ప్రతీ ఒక్క ఆడియెన్ ను తన నటనతోనే కాకుండా రచనతో కూడా మెస్మరైజ్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్. పవన్ తో చేసిన “పంజా” చిత్రంతో మంచి బ్రేక్ అందుకొని తర్వాత తనకు హీరోగా పలు ఆసక్తికర థ్రిల్లర్ స్టోరీస్ చేసి వావ్ అనిపించాడు. అయితే అవి చేస్తూనే మరో పవర్ ఫుల్ సబ్జెక్టు ను కూడా పాన్ ఇండియన్ లెవెల్లో స్టార్ట్ చేసాడు అదే “మేజర్” చిత్రం.

వీర మరణానం పొందిన మేజర్ ఉన్ని కృష్ణన్ గారి జీవిత చరిత్రపై పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి అస్లు ఈ చిత్రం ఎలా మొదలయ్యింది ఫస్ట్ లుక్ టెస్ట్ ఎలా చేసాము అన్నది ఈరోజు రివీల్ చేస్తామని శేష్ తెలిపి రిలీజ్ చేసారు. అసలు మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కోసం ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్ధం కాలేదని ఆయన తనని ఎలా ప్రేరేపించారో అసలు ఈ సినిమా ఎలా స్టార్ట్ అవ్వడానికి కారణాలు ఏంటో అన్నవి శేష్ తెలిపారు.

మేజార్ సందీప్ ఉన్ని కృష్ణన్ తనకు 2008 నుంచి మైండ్ లో ఉన్నారని ముంబై టెర్రర్ దాడులలో ఉన్నపుడు తాను సాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్నారట. అప్పుడు 27న ఒక న్యూస్ ఛానెల్స్ చూస్తున్నపుడు ఆయన ఫోటో వేశారు. అప్పుడు సడెన్ గా చూసి ఎవరా అనుకున్నాను. చూసిన వెంటనే ఆయన కళ్ళు బాగా అట్రాక్ట్ చేసాయి మా ఇంట్లో నా కజిన్ లా అనిపించారు.

ఆయనపై వచ్చిన ప్రతీ న్యూస్ ను కట్ చేసుకున్నాను వాటితోనే పదేళ్లు గడిచి ఇండస్ట్రీలోకి వచ్చాను అప్పుడు మేజర్ లాంటి పాన్ ఇండియన్ చిత్రాన్ని నేను చెయ్యగలను అనే నమ్మకం రావడంతో ఆయన పేరెంట్స్ ను కాంటాక్ట్ చేసి ముందు వారు ఒప్పుకోలేదు అక్కడ నుంచి తర్వాత వారి సపోర్ట్ తోనే వారితో ఉండి ఓకే చెయ్యగలం అనే నమ్మకం తెచుకున్నారట. ఇక అక్కడ అసలైన ఎపిసోడ్ ఏంటంటే మేజర్ సందీప్ గారి ఐకానిక్ ఫోటో చూసారు. పాస్ పోర్ట్ ఫోటో. దానికి కూడా చాలానే స్టోరీ ఉందని చెప్పి ఆ తర్వాత అసలైన టెస్ట్ తాను మేజర్ లా ఉంటానా అన్న దాని నుంచి టెస్ట్ షూట్ చేసాం.

ఆ పిక్ ను రివీల్ చేసింది మాత్రం సూపర్బ్ గా ప్లాన్ చేసారని చెప్పాలి. సందీప్ గారి పక్కన శేష్ ఫోటో హాఫ్ ను పెట్టి మరింత ఆసక్తి కలిగించారు. అలాగే ఇంప్రెసివ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోకు మరింత ఇంపాక్ట్ ఇచ్చింది. ఫైనల్ గా మాత్రం “మేజర్” ఫస్ట్ లుక్ పోస్టర్ ను వచ్చే డిసెంబర్ 17న రివీల్ చెయ్యనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ అలాగే ఇండియన్ సినీ పిక్చర్స్ వారు పాన్ ఇండియన్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More