అడివి శేష్ “G2” షూటింగ్ షురూ!

అడివి శేష్ “G2” షూటింగ్ షురూ!

Published on Dec 11, 2023 12:30 PM IST

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ గూఢచారి 2 (G2). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రం, అంతకుముందు రిలీజైన గూఢచారి చిత్రానికి సీక్వెల్. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ నేడు స్టార్ట్ అయ్యింది.

మిషన్ త్రినేత్ర కోసం ఏజెంట్ 116 వర్క్ చేస్తున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. అడివి శేష్ లుక్ కి సంబందించిన పోస్టర్ ను కూడా షేర్ చేశారు మేకర్స్. చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు అడివి శేష్. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు