శశికిరణ్ దర్శకత్వంలో ఆడవి శేష్ హీరోగా రాబోతున్న చిత్రం ‘గూఢచారి’. ఆడవి శేష్ సరసన శోభిత హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ట్రైలర్ లతో ప్రేక్షకుల్లో ఈ చిత్రం మంచి బజ్ సృష్టించుకుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కూడా పూర్తి చేసుకొని ‘U/A’ సర్టిఫై తో ఆగష్టు 3న గ్రాండ్ గా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది.
ఆడవి శేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పైన మంచి అంచనాలే ఉన్నాయి. గూఢచారి’లో ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉండేలా చిత్రబృందం ఎంతో కేర్ తీసుకోని మరి ఈ చిత్రాన్ని తెరకెక్కించిందట. క్షణం చిత్రం లాగే ఈ చిత్రం కూడా తనకు పెద్ద విజయం తెచ్చి పెడుతుందని ఆడవి శేష్ నమ్మకంగా ఉన్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్స్ పై రూపొందించారు.


