నవంబర్ లో విడుదల కావలసిన ‘ఐ’ సినిమా డిసెంబర్ కి వెళ్ళింది. అయితే డిసెంబర్ లో కూడా ఈ సినిమా విడుదల కావడం అనుమానమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫెబ్రవరిలో శంకర్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెన్నై వర్గాల సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, డబ్బింగ్ వర్క్స్ కంప్లీట్ కాకపోవడమే కారణమని తెలుస్తుంది.
విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటించిన ఈ సినిమాను 180 కోట్ల భారి నిర్మాణ వ్యయంతో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించారు. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. ఏఅర్ రెహమాన్ సంగీతం అందించారు. తెలుగు ఆడియో త్వరలో విడుదల కానుంది. సినిమా విడుదల వాయిదా పడిన వార్తను నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. ఇండియాలో తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు చైనాలో కూడా ఒకేసారి విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


