
భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా రూపొందుతోన్న సినిమా ‘ఎఫైర్’. ఇద్దరు అమ్మాయిల ప్రేమకథకు హర్రర్ థ్రిల్లర్ నేపథ్యాన్ని జోడించి తీసిన ఈ సినిమా ప్రేక్షకుడికి ఓ సరికొత్త అనుభూతినిస్తుందన్న ప్రచారంతో వస్తోంది. ఈ సినిమాకు శ్రీ రాజన్ దర్శకత్వం వహించడంతో పాటు ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ప్రశాంతి-గీతాంజలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ కార్యక్రమం ఈ ఉదయం హైద్రాబాద్‌లో జరిగింది.
టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సినిమా యూనిట్ ‘ఎఫైర్’ సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేసింది. ఓ వైవిధ్యభరితమైన కథకు థ్రిల్లింగ్ అంశాలను జోడించి తీసిన ఈ సినిమా, ఓ సరికొత్త ప్రయోగమని, తప్పకుండా ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందన్న నమ్మకుందని దర్శకుడు శ్రీ రాజన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక నిర్మాత తుమ్మల పల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. దర్శకుడు ఓ కొత్త కథను చాలా బాగా తీశారని, త్వరలోనే ఆడియో, సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.
శ్రీరాజన్, ప్రశాంతి, గీతాంజలి, ధనరాజ్, రాకేష్, సాయిరాజ్, శాని సాల్మోన్, పుచ్చా రామకృష్ణ, హరిత, ఫణి, సంపత్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఎడిటింగ్: సోమేశ్వర్ పోచం, కెమెరా: కర్ణ ప్యారసాని, డి.ఐ-విజువల్ ఎఫెక్ట్స్: రఘు, డైలాగ్స్: అనిల్ సిరిమల్ల, మ్యూజిక్: శేషు కె.ఎం.ఆర్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజన్!